అంతా అవకాశవాదమే!

Bad Society

Devil Writes

11/29/20241 min read

అందరూ నావాళ్ళే అనే భ్రమలో బ్రతుకుతున్నావా?

చుట్టూ ఉన్న వాళ్ళు అంతా నాకు కావాల్సిన వాళ్ళే అని సంబర పడుతున్నావా?

అయితే ఈ పదాలు నీకోసమే..!

నా చుట్టూ నావాళ్లే..ఉన్నారని పొరబడడం

నాతో మాట్లాడే అందరూ నా మంచి కోరే వారే అని సంబర పడడం..

ప్రేమగా మాటలు చెబుతుంటే మురిసిపోవడం..

క్షణక్షణం విచారిస్తుంటే ఉప్పొంగిపోవడం..

నాకంటే అదృష్టవంతులు ఇంకెవరిని మనసుతో మాటిమాటికీ గర్వంగా చెప్పడం..

నీతో ఆవరసం ఉన్నంత వరకే ఇవన్నీ ఉంటాయని తెలియక కలల గూడు కట్టుకుంటావు

నీతో అవసరం తీరాక జరిగే చిన్న చిన్న మార్పులకు మనసు పడే వేదన నరకం చూసీ చూడనట్టు చూపులు మనమే తప్పంటూ ప్రచారాలు పలకరించడానికి సైతం పనికిరాని పాపాత్ము లైపోవడం.