ఆ రోజులు భలే ఉండేవి కదా!

Childhood is memorable

Devil Writes

11/29/20241 min read

చిన్నప్పుడు.. అవును బాగా చిన్నప్పుడు...

రకరకాల బ్రేక్ఫాస్ట్లు తెలీవు, డబ్బు ఖర్చు కూడా తెలీదు, అలాగని పొదుపూ తెలియదు..!!

పోల్చుకోవడాలూ... ఆడంబరాలు అసలే తెలీదు...(ఈ చివరివి ఇప్పటికీ తెలీవు, తెలిసినా ఇష్టపడను)

పొద్దు పొద్దున సరిగ్గా ఆరు గంటలకి "ఆ డబర్రొట్టియో " (బన్స్ ) అంటూ ఒక పొడవాటి రేకు ట్రే లో బన్స్ ని పెట్టుకుని మా వాడకట్టు లో ఒక కుర్రాడు అమ్మేవాడు.

అప్పటికే స్నానం చేసి, పూజ చేస్తున్న నాన్న చేతి లో జపమాల పట్టుకుని బయటకొచ్చి ఆ కుర్రాణ్ని పిలిచేవాడు.

నాకూ అక్కకు పావలా కి రెండు బన్ను లు కొనేవారు. అప్పటికే మెలకువ తో ఉన్న దొంగ నిద్ర పోయి, చంగున లేచి కూర్చునేదాన్ని.

పళ్లు తోముకుని, ఫ్రెష్ అయ్యి, ఆ బన్ను నా చేతికెప్పుడిస్తారా అని కూర్చునేదాన్ని.

మా అమ్మ పెద్ద గలస్ లో చాయ్ తో పాటు బన్ను కూడా తెచ్చి, ముందు పెట్టేది.

ప్రతి రోజూ పావు లీటర్ బర్రె(గేదె) పాలు మాత్రమే తీసుకునేది అమ్మ. అందులోనే రెండు పూటలా చాయ్ మరియు మజ్జిగ.

మరి రంగు, రుచి, చిక్కదనం, గడ్డ పెరుగు అంటే ఏవిటో తెలీదు. వంకలు పెట్టడం, అది బాలేదు, ఇదిలాగే ఉండాలి అని కూడా తెలీని అమాయకత్వం.

అమ్మ ఏది వడ్డిస్తే అది ఆవురావురంటూ తినేయడం. మహా అంటే మొదటి వాయి నాన్న కలిపిచ్చేవారు.

ఇక స్కూల్(ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల) కి వెళ్ళేటప్పుడు, నిన్న రాత్రి మిగిలిన చద్దన్నం లో నూనె వేసి మిరప్పండు తొక్కో(పచ్చడి) చింతకాయ తొక్కో కలిపి నాకూ, అక్కకి పెద్ద పెద్ద లడ్డూల్లా చేసి చేతి లో పెట్టేది అమ్మ...

గబ గబా తింటూ మధ్యలో ఉస్స్స్ ఉస్స్...(కారం, ఘాటు) అని సౌండ్స్ చేస్తూ తినేసి స్కూల్కి వెళ్ళేవారిమి.

మధ్యాహ్నం ఒంటిగంటకి ఇంటి బెల్ కొట్టగానే వచ్చేసి, అమ్మ వడ్డించే భోజనం (ఒక్కటే కూర లేదా పప్పు, చల్ల) తినేసి ఒకయిదు నిమిషాలు కూర్చుని అమ్మని చూసేదాన్ని.

అప్పటికే పనంతా (ఇల్లు శుభ్రం, అంట్లు, బట్టలు, వంట, ఆవిడ భోజనం) చేసేసి, విశ్రాంతి దేవత లా చిరి చాపలో ఒక మెత్త(తలగడ) పై తల ఆనించి హాయిగా సిలోన్ లో వచ్చే పాటల్లో మధ్యలో తన గొంతు కలుపుతూ వింటూ ... విశ్రాంతి తీసుకునేది.

మళ్లీ మధ్యాహ్నం స్కూల్ కి వెళ్లి, సరిగ్గా నాలుగ్గంటలకు ఇంటికి రాగానే.. మధ్యాహ్నమ్ మిగిలిన అన్నం కాస్త కలిప్పెట్టి, చాయ్ ఇచ్చేది.

అవి కానిచ్చేసి, ఆడుకొవడానికి వీధిలోకెళ్లేదాన్ని.

మమ్మల్ని చూస్తూ అరుగు మీద గోడకు ఆనుకుని, మా నాన్న కోసం ఎదురు చూస్తూ నుంచునేది అమ్మ. అలా