స్త్రీ శెలవు కోరుకోవటం తప్పంటారా?

Do Women really need Holiday

Ganesh

12/9/20241 min read

స్త్రీ! ఈ ఉద్యోగానికి ఒక్క శెలవు కూడా ఉండదు.

స్త్రీ ఎన్నో ఆశలతో పెళ్ళి అనే బంధంలో అడుగిడుతుంది.. కోడలిగా ఇంట్లో ఎవరికి ఏం ఇష్టమో తెలుసుకుని కొసరి కొసరి వడ్డిస్తుంది..భార్యగా, కోడలిగా, వదినగా, బిడ్డలకు తల్లిగా, ఎన్నో భాధ్యతలు మోస్తుంది.. ఎంత ఆరోగ్యం సహకరించకపోయిన తన పనిలో మాత్రం మార్పు ఉండదు..ఏపని వదిలిపెట్టలేదు ఏ పని తప్పుతుంది. స్త్రీ అంటే ఇంటికి భర్తరాగానే చిరునవ్వుతో ఎదురు వెళ్ళాలి..నిజమే మరి తన పని ఒత్తిడిని మరిచిపోయేటట్టు ఆ భర్త ప్రవర్తన కూడా ఉండాలిగా. అతని ఆఫీసు పనులలో అతని ఒత్తిడి అర్థం చేసుకొవాలి మరి.

స్త్రీ కి ఆమె ఒత్తిడి సంగతేంటి? ఆదివారం వస్తే ప్రత్యేక వంటలు కావాలంటారు. పండగలొస్తే వచ్చివెళ్ళేవారితో తీరికలేని పని...అది ఎందుకు కనిపించదు..ఆ పెనిమిటికి. స్త్రీ ఎంత పనినైనా మరిచిపోతుంది. భర్త చూపించే ప్రేమతో..పిల్లలు వచ్చి అమ్మని చుట్టేస్తే ఆ ఆనందం. ముందు ఏపనీ అలసటా ఉండదు. స్త్రీ ఎన్నోరకాలు వండిపెట్టి ఆమె వడ్డించేటప్పుడు...ఆహా నీ చేతి భోజనం రుచి ఎక్కడా దొరకదనండి...ఆ మాట చాలు పొంగిపోతుంది..

స్త్రీ ని రోజూ ఇంత కష్టపడతావు! ఈ రోజు నీకోసం ఏదైనా చెయ్యాలని ఉంది అని, ఆమెని అడిగినపుడు ఒక్కరోజు శెలవు కావాలి అని అడగగలదా. స్త్రీ చిన్నతనం నుండి ముసలిది అయ్యేవరకూ ఎక్కడున్నా, ఎటువెళ్ళినా పని చేయక తప్పదు. అదే పురుషుడు అయితే ఆదివారం శెలవు, పండగ శెలవు, అత్తవారింట V.I.P వసతులు, రిటైర్మెంట్లు. స్త్రీ కి ముసలితనం వచ్చాకా ఆహా. బామ్మానీచేతి రోటిపచ్చడి ఎంత బావుంటుందో అంటే చాలు ఎక్కడ లేని ఓపిక తెచ్చేసుకుని బిడ్డలకోసం ,మనవల కోసం ఆరాటపడిపోతుంది...వాడికి నేను చేసిందంటే చాలా ఇష్టమే అమ్మాయ్ వాడు వెళ్ళేటప్పుడు కాస్త డబ్బాలో పెట్టి ఇవ్వు అనుకుంటూ మురిసిపోతుంది.. స్త్రీ కి రిటైర్మంట్ ఉందా....ఒక్కరోజైనా శెలవు ఉంటుందా.

స్త్రీ కి తుది శ్వాస విడవటమే శెలవా? స్త్రీ శెలవు కోరుకోవటం తప్పంటారా?