విలువైన వ్యక్తులను వదులుకోకండీ..

Life is Precious

Devil Writes

11/29/20241 min read

జీవితం అంటేనే చాలా వింత అనుభవాలు..

కొన్ని మన చేతుల్లో ఉంటాయి, కొన్ని మన చేతుల్లో ఉండవు..

మనం ఒకరిని‌‌ ప్రేమిస్తాం..

మనల్ని ప్రేమించే వారిని వదిలేస్తాం..

మనం ప్రేమించే వారిలో ఏ క్వాలీటీస్ లేకపోయినా ఏదో నచ్చింది అనీ వెంట పడతాం,ఛీ కొట్టించుకుంటాం,

చివరకు సిన్సియర్ గా ప్రేమించినా కూడా ఏదో ఆశిస్తున్నారు అనుకుంటూ మనల్ని దూరం పెడతారు..

దాంతో మనం తట్టుకోలేం..

అనవసరంగా మన మనస్సు ను మనమే గాయం చేసుకుంటాం.

కానీ ఒక్కసారి మనల్ని ప్రేమించే వారిని మనం గుర్తు తెచ్చుకోం..

Ignore చేస్తాం,క్షోభ పెడతాం,ఏదో హీరోల్లా ఫీల్ అయిపోతాం ,వాళ్లని చులకనగా చూస్తాం..

కానీ మనం మాత్రం ఎదుటివారి తో మాటలు పడుతూనే ఉంటాం..ఎదురు చూస్తూ ఉంటాం,

ఇక కొందరు అయితే చివరి టెక్స్ట్, మెసెజ్లు చూస్తూ గడిపేస్తాం..

కానీ ఆశలు ఆవిరయ్యాక మనల్ని ప్రేమించిన వారిని మనం వెదికేలోపు వాళ్లు మనకు దూరం అయుంటారు..

అప్పటికే కొన్ని కొత్త బంధాలతో కనెక్ట్ అయిపోయుంటారు..

మళ్లీ మన జీవితం లో ఎంటర్ అయ్యే ఛాన్సులుండవు..

మనమే ప్రపంచం గా బతికే వాళ్లని Avoid చేస్తాం..

ఇందులో కుటుంబం ని కూడా మరచిపోయే వారున్నారు..

గ్లోబలైజేషన్ తర్వాత ట్విట్టర్, ఫేస్ బుక్, వాట్సప్ వచ్చాక

ఇక్కడ వచ్చే లైకులు,కామెంట్లు,షేర్లు, పేరు చూసి మురిసిపోతాం కానీ ఆపద వచ్చినప్పుడు వచ్చే వారు తక్కువ..

వచ్చినా దానిని కూడా పోస్ట్ లు పెట్టుకొని పబ్లిసిటీ చేసుకుంటూ ఏదో సామాజిక సంఘ సంస్కర్త లా ఫీల్ అవుతాం..

మన జీవితం లో సమయం చాలా ప్రాముఖ్యం...

ఆ సమయాన్ని కూడా మనల్ని అభిమానించే వారు/ప్రేమించే వారి కోసం కేటాయించం..

ఈ రోజుల్లో త్వరగా వరుసలు కలుపుకుంటాం,అంతే త్వరగా నే అపార్థం చేసుకుంటాం..

ఒక వస్తువు కొనే ముందు రివ్యూలు చూస్తాం

ఒక చీర కొనే ముందు కూడా చాలా సార్లు ఆలోచిస్తాం కానీ

మన జీవితం లో విలువైన క్షణాల కోసం ఆలోచించము..

మనకు నచ్చినట్లే జరగాలీ/నచ్చినట్లే నడవాలీ

ఇదొక నియంత లా అహంకారపూరిత స్వభావం..

ఎవరి కోసమో మనల్ని మనం మోసం చేసుకుంటున్నామన్నా "ఇంగిత జ్ఞానం" ఉండదు..

మనలో తప్పుల్ని పెట్టుకొని ప్రకృతి మీదనో,పొరుగు వారి మీదనే పడేస్తాం ..

ఏదో సాధిద్దాం అనుకొని ఏదో ఒక /కొందరి మెప్పు కోసం మళ్లీ అక్కడ చక్ర బంధంలో ఇరుక్కుపోతాం..

వాళ్లు మనల్ని Ignore చేస్తే బాధపడతాం.

ఇక ప్రపంచంలో ఎవర్ని నమ్మకూడదనుకుంటాం..

కానీ మనల్ని మనం చేసుకుంటున్నామన్నా స్పృహ ఉండదు..

జీవితం అవకాశాలు అనే తలుపులు తడుతూ ఉంటుంది

కానీ మనమే మూస పద్దతి లో తెరవము..

మనల్ని లేపడానికీ ఒక నాయకుడో రావాలీ,ఒక గురువు రావాలీ..

ఒక శ్రీ శ్రీ నో రావాలీ,ఒక చలం కావాలీ,ఒక వివేకానంద కావాలీ..

మన జీవితం ఎప్పుడూ ఏదో ఒక వ్యక్తి మీద ఆధారపడాల్సిందే..

(Inspired అవడంలో తప్పు లేదు కానీ Self motivationలేనిదే ఏం చేయలేం).

మన జీవితం లో శతృవులు ఎవరూ లేరు/రారూ

ఓర్వలేని వారు ,అసూయ పరులే మనకు మొదటి శతృవులు..

అంతకు మించిన శతృవు మనమే..

పదిమందిలో గొప్ప గా బతకాలనీ,పది మంది మెప్పు కోసం

ఎవరి కోసమో లైఫ్ ని Sacrifice చేస్తాం కానీ.

ఏ స్వార్థం లేకుండా మనల్ని ప్రేమించుకుంటున్నామా అనీ ఆలోచిస్తే లైఫ్ లో నన్ను నేను మిస్ చేసుకున్న సందర్భాలు గుర్తొచ్చాయి..మనల్ని ప్రేమించి/అభిమానించే వారిని హర్ట్ చేసిన సందర్భాలూ గుర్తొచ్చాయి..

అందుకే ఈ చిన్న జీవితం లో

"ఒంటరిగా" నన్ను వెదుక్కుంటూ..

"ప్రశాంత పవనాల" పర్వతాన..

"ప్రకృతి ఒడిలో"

"పంచ భూతాల" పాఠాలతో..

స్వగతం నేర్పిన గత అనుభవాల స్మృతులతో

యాంత్రిక మనుషులకు,చదువులకు దూరం గా..

నాతో నేను, నాలో నేను ఉండే సమయం ఆసన్నమైందని అనుకుంటున్నాను..

ఒక "పర్వాన్ని" ముగించాలనీ

ఒక "అధ్యాయాన్ని" సమాప్తం చేయాలనీ

ఒక "పాత్రని" ఆపివేయాలనీ

ఒక "భాగం" నుండి నిష్క్రమించాలనీ

"సమయం" చెప్తుందేమో అనిపించింది..

చివరిగా Conclusion మిస్ అవకూడదనీ చెప్తున్నాను.

జీవితం చాలా విలువైనది..

విలువైన క్షణాల కోసం వెయిట్ చేయండి

విలువైన వ్యక్తులను వదులుకోకండీ..