నలుగురు భార్యల కథ!
Devil Writes
11/23/20241 min read
ఒక వ్యక్తికి నలుగురు భార్యలు, నాలుగవ భార్య అంటే చాలా ప్రేమ అతనికి, ఆమెకోరిన కోరికలన్నీ తీర్చేవాడు,ఎంతోఅపురూపంగా చూసుకునేవాడు,అయితే, మూడవ భార్య అన్నా ఇష్టమే. కానీ తన గురించి మంచిగా స్నేహితుల దగ్గరచెప్పేవాడు కాదు, తను వారితో వెళ్ళిపోతుందేమో అన్న భయంతో, రెండవ భార్యదగ్గరికి తనకు ఏదైనా సమస్య వస్తేనే వెళ్ళేవాడు ఆమె కూడా అతని సమస్యను తీర్చి పంపేది.
మొదటి భార్య అంటే అస్సలు ఇష్టమే ఉండేదికాదు, ఆమెను అస్సలు పట్టించుకునే వాడే కాదు, ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి అతని ఆరోగ్యం క్షీణించిపోయింది.ఇక తను బ్రతకను అని తెలిసిపోయి తనమీద ఎవరికి నిజమైన ప్రేమ ఉందో తెలుసుకోవడానికి తన నాలుగవ భార్యను పిలిచాడు.
" నేను మరణానికి అతి దగ్గరలో ఉన్నాను నిన్ను చాలా ప్రేమగా చూసుకున్నాను కదా! నాతో పాటు నువ్వు కూడా వచ్చేసేయ్, మరణంలో కూడా నాకు నీతోడే కావాలి " అని అన్నాడు. నాలగవ భార్య అది విని అతనికి దూరంగా జరిగిపోయింది, ఆశ్చర్య చకితుడై తన మూడవ భార్యను ఇదే కోరాడు. మూడవ భార్య ఇలా అంది. " ఇన్ని రోజులు నీతోనే, నీ దగ్గరే ఉన్నాను, నీ అవసరాలన్నీతీర్చాను. ఇక నాకు నీతో పనిలేదు.వేరేవారి దగ్గరికి వెళ్ళిపోతున్నాను".
బాధతో ఏడుస్తూ తన రెండవ భార్యను ఇలాగే అడిగాడు, "నేను నీతో పాటు నీ శవయాత్రలో పాల్గొనేంత వరకు నీవెంట ఉంటాను, తరువాత నేనువెళ్ళిపోతాను, నిన్ను అప్పుడప్పుడు తలచుకోగలను." అంది.
ఇంత ప్రేమగా చూసుకున్న ఈ ముగ్గురూ ఇలా అనేసరికి ఇక మొదటి భార్యనుబాగా నిర్లక్ష్యం చేశానుకదా తనని అడగడం వృద్ధా అని భావిస్తుండగా, మొదటిభార్య తలుపు చాటునుండి ఇలా అంది.
"మీరు నన్ను ఎంత నిర్లక్ష్యం చేసినా నేను మాత్రం మీ వెంట మీ చివరి పయనందాకా తప్పక వస్తాను మీరేమీ బాధపడకండి " అతని కంట నీరు ఆగకుండా ప్రవహిస్తూనే ఉంది.
కాబట్టి మనిషి దేన్నీ ఎవరినీ నిర్లక్ష్యం చేయకూడదు.మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, పోయే ముందు తెలుసుకుని ప్రయోజనం ఉండదు.నిజం చెప్పాలంటే మనం అందరం నలుగురు భార్యల్తోనే ఉంటున్నాము.అదేంటి అలా అంటున్నారు అని ఆశ్చర్యంగా ఉందా?
నాలుగవ భార్యమన శరీరంకాగా, మూడవ భార్య సంపద, ఆస్థిపాస్తులుకాగా, రెండవ భార్య నేస్తాలు, బంధువులు. ఇకమొదటి భార్య ఎవరో కాదు అదీ మన ఆత్మ.
నిజమే కదా! దయచేసి మన ఆత్మ చెప్పిన దాన్ని ఆచరించండి, పెడచెవిన పెట్టి నిర్లక్ష్యం చేయకండిఅనిముగిసింది..
Who we are
At Telugu Content Crafters, we unite creators dedicated to producing engaging digital content in Telugu, spanning videos, blogs, film criticism and Social Media content etc.
Contact us
© 2024. All rights reserved.
Follow us