నేల విడిచి సాము??

Unfortunate Tollywood

Devil Writes

12/7/20241 min read

ఎందుకో సినిమా ప్రపంచాన్ని చూస్తుంటే ఏదో తెలియని అభద్రతా భావం కనిపిస్తుంది. ఒక పక్క దేవర..మరో పక్క పుష్ప-2 ఈ రెండు సినిమాలూ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనాలుగా నిలిచాయి అనడంలో ఏమాత్రం సందేహించాల్సిన పనిలేదు. ఇక యంగ్ టైగర్ NTR , మరో పక్క ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరూ undoubtedly సూపర్ యాక్టర్స్, ఒకరు గ్లోబల్ స్టార్, మరొకరు నేషనల్ అవార్డు విన్నర్..అయితే తాజాగా చూస్తున్న పరిణామాలు, అటు సోషల్ మీడియాలో ఇటు డిజిటల్ మీడియాలో వినిపిస్తున్న కధనాలు చూస్తుంటే ఎక్కడో ఎదో తెలియని భయం ఏర్పడుతుంది..

ఒక పక్క యంగ్ టైగర్ కుటుంబం విషయంలో మౌనం వహిస్తుంటే, మరో పక్క అల్లు అర్జున్ స్నేహితుని కోసం ప్రచారానికి వెళ్లి సొంత కుటుంబాన్ని శత్రువుగా చూస్తున్నాడు అన్న అపవాదు మొయ్యాల్సి వస్తుంది.. అసలే రాజకీయాల పుణ్యమా అని సంభంధం లేని సామాన్యులు సొంత వారికీ దూరం అయిపోతున్నారు. నిజమే ఆంధ్రాలో కోస్తా జిల్లాల సరిహద్దులకు వెళితే ఇంట్లో కన్న తండ్రి, కొడుకు ఇద్దరూ వేరు వేరు రాజకీయ పార్టీలు మద్దతు దారులుగా ఉంటే వారిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోనంత శత్రువులుగా ప్రవర్తిస్తారు..మరో పక్క పల్నాడు పగల వాసన చూస్తే కరడు కట్టిన కాంగ్రెస్ పార్టీ అభిమానులు శుభకార్యాలకు సైతం తమ ఇంటి గడపలకు కనీసం పసుపు కూడా రాయనంత ద్వేషాన్ని నింపుకున్నారు..ఇలా రాజకీయంగా విడిపోయి శత్రువులుగా బ్రతుకుతున్న ఈ తెలుగు సమాజం మరోమారు పెద్ద పెద్ద సినీ తారల కోసం మరోమారు కత్తులు దూసుకోవడం చూస్తుంటే ఏదో తెలియని భయాందోళన కలిగిస్తుంది.

అప్పట్లో మెగా vs నందమూరి అన్న లెక్క ఉన్నా ఆ పోటీ తత్త్వం వేరుగా ఉండేది. చిరు, బాలయ్యా ఇద్దరూ మేము ఎప్పుడూ స్నేహితులమే అంటూ అభిమానులకు Positive సంకేతాలు ఇస్తూనే ఉండేవాళ్ళు..అయితే ఈతరానికి చెందిన మనం ఎంత పెద్ద అభిమానులం అయినా మనం అభిమానించే ఈ యువ హీరోలకు ఈ స్థాయికి చేరుకునే ప్రయాణంలో పెద్దవాళ్ళ తోడు ఖచ్చితంగా ఉంది. ఉదాహరణకి ఎన్టీఆర్ తొలి సినిమా ఆదిలో బాలయ్య కనిపిస్తాడు..అల్లు అర్జున్ గంగోత్రిలో మావయ్యది మొగళ్తూరు అన్న మాట వినిపిస్తుంది.. అంటే ప్రత్యక్షంగా కాకపోయినా, పరోక్షంగా అయినా వీళ్ళ స్థాయికి వాళ్ళు కారణం అనేగా అనిపించేది.. మనం ఎంత గొప్ప వాళ్ళం అయినా పెద్దవారిని మించిపోయాం అని అనుకుంటే అది ఖచ్చితంగా శుభసూచకం కాదు అని చెప్పక తప్పదు.. అన్నీ బావున్నప్పుడు నా అంతటోడు లేడు అనుకుంటే, కష్టాలు కమ్మినప్పుడు ఒంటరివాడైపోవడమే మిగులుతుంది..

అభిమానులు ఎప్పుడూ హద్దులు మీరి అభిమానిస్తే నష్టపోయేది ఆ అభిమానించే గుండెలే!..

ఓ పిచ్చి అభిమాని ఆలోచించు!