Salute సైనిక!

Salute Soldier

K V Rao

12/8/20241 min read

పార్ధివ దేహం కూడా ఒక మహా ప్రార్ధనా గోపురమే...

చేతులు జోడించిన వారే వేళ్ళతో కుళ్ళగించి మరీ గోతులు తీయక తప్పదు పాతి పెట్టడానికి...

ఒకరి గర్వం అణచివేయడానికి ఎన్ని గర్భాలను గార్దభాండాలతో నింపుతారు...

నిండా నిందల్ని మోసే సైన్యం ఎదురుగా మోహరించిన మందల్ని చూసి చలించదు.

ఎన్ని భగవద్గీతలు గుండెల్ని భగ భగ మండింనా.. నిర్జీవాయుధాలను బుజ్జగించి ముద్దాడే సేనాధిపతులు అవసరమైనప్పుడు ప్రాణాధిపతులు కూడా నిండు ఆయువుని కుదించెయ్యడానికి ..

గుర్రాలకూ గుప్పెడు బుర్ర ఉంటుందని ఏనుగులకూ వేప కాయంత పిరికితనముంటుందని గ్రహించిన సైనికుడే విజయానికి ఎర్ర తివాశీ పరిచే పనిలో నిమగ్నమై ఉంటాడు...